- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలు జెడ్పీ సర్వసభ్య సమావేశం.. రచ్చ రచ్చ
ప్రకాశం జిల్లా ఒంగోలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది..

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) ఒంగోలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం(Ongole ZP General Meeting) రసాభాసగా మారింది. వెలుగొండ ప్రాజెక్టు(Velugonda Project) నిధుల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్(YSRCP MLA Chandrasekhar), ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Vice President Mula Chandrasekhar) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పనులు ఎలా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిలదీశారు. ఈ సమావేశంలో రాజకీయాలు చేయొద్దని ఎంపీ మాగుంట సూచించారు. అయినా సరే ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ మేరకు సమావేశం మధ్యలోనే ఎంపీ మాగుంట వెళ్లిపోయారు. వైసీపీ MLAల విషయంలో ప్రొటోకాల్ పాటించడంలేదని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. తాము అధికారంలో ఉన్నసమయంలో అందరికి అవకాశం ఇచ్చామని, కానీ కూటమి నేతలు తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు.






