- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలులో మళ్లీ రచ్చ.. ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
ప్రకాశం జిల్లా ఒంగోలు కూటమి రాజకీయం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ(Ycp) నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ...

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) ఒంగోలు(Ongole) కూటమి రాజకీయం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ(Ycp) నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasareddy) వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దనరావు(Damacharla JanardhanRao) విజయం సాధించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరడంతో మళ్లీ ప్రత్యర్ధుల గోల మొదలైంది. దీంతో అధినేతల మధ్యవర్తిత్వంతో కొద్దిరోజులు ఈ రచ్చ కామ్‌గా ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ప్రారంభమైంది.
బాలినేని వర్సెస్ దామచర్
ఇటీవల ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎవరి హయాంలో అవినీతి జరిగిందో తేల్చుకుందా రా అంటూ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని ఇప్పటివరకూ ఓపిక పట్టామన్నారు. ఇక నుంచి ఊరికునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తనకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు ఒంగోలులోనే ఉంటానని చెప్పారు. తన కుమారుడు గంజాయి సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారంటూ అదంతా నిజంకాదని బాలినేని శ్రీనివాసరెడ్డి కొట్టిపారేశారు.






