రజినీకాంత్ అనే పేరు కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లేవి.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సూపర్ స్టా్ర్ రజినీకాంత్(Rajinikanth) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు.

రజినీకాంత్ అనే పేరు కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లేవి.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టా్ర్ రజినీకాంత్(Rajinikanth) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని రజినీకాంత్ సొంతం చేసుకున్నారు. మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలి. ఆయన పేరు తెరమీద పడగానే థియేటర్లు ఏ విధంగా దద్దరిల్లుతాయో చెన్నైలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూశాను. తరాలు మారుతున్నా ఆయన వన్నె తగ్గలేదు. సినీ జీవితంలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే చంద్రబాబు, ప్రధాన మంత్రి మోడీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘కూలీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం అలరిస్తోంది.

Next Story