- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు.. మంత్రి నారా లోకేశ్
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

అమరజీవి త్యాగం.. అజరామరం
దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు
ఆయన ఫాదర్ఆఫ్లింగ్విస్టక్స్స్టేట్స్
అమరావతిలో ఆయన స్మృతివనం ఏర్పాటు
రోశయ్య రాజకీయాల్లో లేని లోటు తెలుస్తుంది..
శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, దక్షిణాదిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆ ఆయన ఆమరణ నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే పెను మా ర్పులు వచ్చాయన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు తెలుగుజాతి కోసం ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే.. పొట్టి శ్రీరాములు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ స్టేట్స్ అని పిలుస్తారని తెలిపారు. కొన్ని దీపాలు వెలుతురిని ఇస్తాయి.. మరికొన్ని దీపాలు దారిని చూపిస్తాయని లోకేష్ అన్నారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మందికి దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులపాటు ఆయన చేసిన దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి రాజధానులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దళితులను గుడిలోకి ప్రవేశించాలని పొట్టి శ్రీరాములు పోరాడారని గుర్తు చేశారు.
పొట్టి శ్రీరాములు వంటి వ్యక్తి పదిమంది ఉంటే భారతదేశానికి స్వాతంత్రం ఒక్క ఏడాదిలో వస్తుందని ఆనాడు గాంధీ చెప్పారని అన్నారు. ఆయన జీవితం నుంచి చాలా నేర్చుకోవాలని పేర్కొన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన పోరాడే అని తెలిపారు. పొట్టి శ్రీరాములు నుంచి పట్టుదలను నేర్చుకోవాలన్నారు. ఏదైనా సాధించాలని పట్టుదలతో తొలి అడుగు వేస్తే సమాజం మొత్తం మన వెనుక వస్తుందని అన్నారు. ఎన్ని దశాబ్దాలు అయినా ఆయనను ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమే అని అని తెలిపారు. మాజీ సీఎం దివంగత రోశయ్యను కూడా లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఆయన గవర్నర్ అయిన తర్వాత ఏడాదికి ఒకసారి అయినా మాట్లాడే వాడిని గుర్తు చేశారు. మీరు రాజకీయాల్లో లేని లోటు తెలుస్తుందని ఆయనతో తాను చెప్పానని అన్నారు. మిమ్మల్ని చూసి పెరిగినవాడిని.. మీరు ఎలా అసెంబ్లీలో పోరాడారో చూశానన్నారు. రాజశేఖర్రెడ్డికి.. చంద్రబాబు నాయుడుకి మధ్య యుద్ధం జరుగుతుంటే.. ఒక్క మాటతో దానిని చల్లబరిచే వారిని ఆయన గుర్తు చేశారు. ఇలా రాష్ట్రం కోసం పనిచేసిన వారందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొట్టి శ్రీరాములు స్మృతివనం కట్టడమే కాదు.. ఒక రీసెర్చ్ చైర్మన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు చరిత్రపై పరిశోధన జరగాలని లోకేశ్ ఆకాంక్షించారు.






