- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌పై పోతిన మహేశ్ సంచలన ఆరోపణలు
by Vemula.Srinu Prasad |
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన ఆరోపణలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పవన్ కల్యాణ్ పిఠాపురం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. అయితే పవన కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన ఆరోపణలు చేశారు. అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ అన్నీ అబద్ధాలే చెప్పారని వ్యాఖ్యానించారు. పవన్ అఫిడవిట్‌ను తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్‌లో చూపిన పవన్ ఆస్తులు, లావాదేవాల్లో లాజిక్ లేదన్నారు. చంద్రబాబుకు జనసేనను హోల్ సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు. 2 చిత్రాలతో పవన్ రూ. 90 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా సంపాదనతో వచ్చాయా..? లేక పొలిటికల్ ప్యాకేజీతో వచ్చాయా అని పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు.
Next Story






