- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారుకు వ్యతిరేకంగా FBలో పోస్టులు.. GST అసిస్టెంట్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుపతి (Tirupati) ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఎన్.సుభాష్ చంద్రబోస్ (N Subhash Chandra Bose)పై సస్పెన్షన్ వేటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, తాజాగా రాజధాని అమరావతి (Amaravati) మునిగిపోయిందంటూ సుభాష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు. దీంతో ఆ విషయంపై సర్కారుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో సుభాష్‌ను వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. కానీ, ఆయన ఇచ్చిన వివరణలో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం తన వ్యక్తిగత అభిప్రాయమని అతడు అధికారులు బదులిచ్చారు. ఈ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం, ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పిస్తూ సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేశారు.






