Posani: ఓవరాక్షన్‌కు.. ఇదే రియాక్షన్! అర్థమైందా రాజా.. అంటూ నెట్టింట సెటైర్లు

by Thanuru Gopichand |   (  Updated:2025-02-27 12:22:17  IST  )

జగన్ హయాంలో నాటి బూతు బాకా.. పోసాని కృష్ణమురళి పాపం పండింది’ అంటూ టీడీపీ విమర్శిస్తోంది.

Posani: ఓవరాక్షన్‌కు.. ఇదే రియాక్షన్!  అర్థమైందా రాజా.. అంటూ నెట్టింట సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘జగన్ హయాంలో నాటి బూతు బాకా.. పోసాని కృష్ణమురళి (posani krishna murali) పాపం పండింది’ అంటూ టీడీపీ విమర్శిస్తోంది. ‘నీ పాపం పండింది రాజా.. అనుభవించు’ అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నిన్న హైదరాబాదులో సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు (ap police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు (chandrababu), పవన్ (pawan) కుటుంబం‌పై పోసాని ఒంటికాలిపై లేచేవాడు. వారిపై విమర్శలకు ముందుండేవాడు. ఇదే విషయాన్ని టీడీపీ గుర్తుచేస్తోంది. జగన్ ఇచ్చిన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి కోసం కృష్ణ మురళి అత్యంత నీచంగా మాట్లాడారని విమర్శిస్తోంది. పోసానికి కాసుల కక్కుర్తి, పదవుల వ్యామోహం ఉందని, అందుకే తనకు అన్నంపెట్టిన సినీ పరిశ్రమపైనా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాడని టీడీపీ మండిపడుతోంది. మరోవైపు పోసానికి అండగా ఉంటామని జగన్ చెప్పడం ద్వారా.. ఆయన తన హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు అన్నీ తానే చేయించానని పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని టీడీపీ (tdp) ఆరోపిస్తోంది.

వైసీపీ ఓడిపోయిన తర్వాత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో రాజకీయాల గురించి తాను ఇక మాట్లాడను.. అంటూ ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ‘100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్తే మాత్రం చేసిన పాపం పోతుందా రాజా..?’ అంటూ సోషల్ మీడియా (social media) వేదికగా టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో వైద్య పరీక్షల అనంతరం పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్​నాయుడు విచారిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలపై ఆయన విచారణ చేస్తున్నారు. అనంతరం ఆయన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు.


Also Read...

Posani KrishnaMurali : పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదు

Next Story