- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Posani: నరసారావుపేట పోలీసుల అదుపులో పోసాని మురళీ కృష్ణ..
పీటీ వారెంట్ (PT Warrant)పై రాజంపేట సబ్‌జైలు (Rajampet Sub-Jail)కు వచ్చిన వైసీపీ నేత, నటుడు పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)ను నరసారావు పేట (Narasaraopet) పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పీటీ వారెంట్ (PT Warrant)పై రాజంపేట సబ్‌జైలు (Rajampet Sub-Jail)కు వచ్చిన వైసీపీ నేత, నటుడు పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)ను నరసారావు పేట (Narasaraopet) పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనపై 153A, 504, 67 ఐటీ కింద కేసు నమోదు అయినట్లుగా వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై మొత్తం 17 కేసులు నమోదు కాగా, అందులో 3 జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట (Rajampet) జైలు అధికారులకు పీటీ వారెట్లు సబ్‌మిట్ చేశారు. ఈ మేరకు తాము మేం కోర్టు అనుమతి తీసుకున్నామని ముందుగా మాకే పోసానిని అప్పగించాలంటూ అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోసానిని పల్నాడు జిల్లా (Palnadu District) నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. మరికొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు.






