Posani KrishnaMurali : పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్

by Muthe.Rajitha |

సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)కి కోర్ట్ 10 రోజుల రిమాండ్ విధించింది.

Posani KrishnaMurali : పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)కి కోర్ట్ 10 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో టీడీపీ నాయకుడు కిరణ్(Kiran) పోసానిపై ఫిర్యాదు చేయగా.. పల్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరు పరచగా.. విచారణ అనంతరం కోర్ట్ 10 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు పోసానిని గుంటూరు జైలు(Guntur Jail)కు తరలించారు.

కాగా ఇప్పటికే పోసాని కృష్ణమురళి మీద ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. కాగా అన్నమయ్య జిల్లాల సంబేపల్లిలో నమోదైన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయననను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి నరసనరావుపేటలో నమోదు అయిన కేసుకు సంబంధించిన కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈనెల 13 వరకు రిమాండ్ విధించారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున కడప మొబైల్ కోర్టులో వాదనలు వినిపించారు.

Next Story