- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: జైలులో పోసానికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: రాజంపేట సబ్ జైలు(Rajampet Sub Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పోసాని అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో ఆస్పత్రి వద్దకు స్థానిక వైసీపీ(Ycp) నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోసాని ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. మరికాసేపట్లో పోసాని హెల్త్‌పై వైద్యులు అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా చంద్రబాబు(Chandrababu Naidu), పవన్(Pawan Kalyan), లోకేశ్(Nara Lokesh)తో పాటు కులాల పేరుతో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని పోసానిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు హైదరాబాద్ నివాసంలో ఉన్న పోసానిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పీఎస్‌కు తరలించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనల విన్న ధర్మాసనం... పోసానికి రిమాండ్ విధించింది. దీంతో రాజంపేట సబ్ జైలుకు ఆయన్ను తరలించారు. తాజాగా పోసాని అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.






