పిఠాపురాన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తారు: హైపర్ ఆది (వీడియో)

by Disha Web Desk 2 |
పిఠాపురాన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తారు: హైపర్ ఆది (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైన నేపథ్యంలో కొన్నాళ్లు షూటింగ్స్‌కు బ్రేకింగ్స్ ఇచ్చారు. జనసేన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆది పేరు కూడా ఉండటంతో తన వంతుగా జనసేన తరపున ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగార. గురువారం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో పిఠాపురం నియోజకవర్గాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తండోపతండాలుగా వస్తారని అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని చూసేందుకు టూరిస్టులు ఏ విధంగా అయితే వస్తున్నారో.. మున్ముందు పిఠాపురాన్ని చూసేందుకు కూడా వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed