AP News : పాప్ కార్న్ రూ.750.. షాకైన అధికారులు

by Muthe.Rajitha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు(Theater Rides) చేపట్టారు.

AP News : పాప్ కార్న్ రూ.750.. షాకైన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు(Theater Rides) చేపట్టారు. థియేటర్లలో భద్రతా చర్యలు, సౌకర్యాలు, క్యాంటీన్ ధరలను పరిశీలించడంపై లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లోని థియేటర్లలో ఈ సోదాలు జరిగాయి. విశాఖలోని ఓ మల్టీప్లెక్స్‌లో అధికారులు తనిఖీ చేస్తుండగా.. ఒక ఫ్యామిలీ పాప్‌కార్న్ ప్యాక్ ధర రూ.750, వాటర్ బాటిల్ రూ.40 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఈ అధిక ధరలను చూసి అధికారులు షాక్ తిన్నారు. ఈ సమస్యను పవన్ కల్యాణ్ ముందే హైలైట్ చేస్తూ.. థియేటర్ క్యాంటీన్‌లలో పాప్‌కార్న్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇది సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని అన్నారు. ఈ తనిఖీల్లో సరైన సౌకర్యాలు, భద్రతా చర్యలు లేని థియేటర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. థియేటర్లలో నాణ్యత, ధరల నియంత్రణ, సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story