- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవ్ జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు : హైకోర్టుకు తెలిపిన పోలీసులు
ఇటీవల ఏపీ పోలీసులు విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఏపీ పోలీసులు విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టాప్ మావోయిస్టులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలను వెంటనే కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే హైకోర్టు ముందు వివరణ ఇచ్చిన పోలీసులు.. దేవ్ జీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని తెలిపారు. దీంతో వారు పోలీసుల వద్దనే ఉన్నారనే ఆధారాలు చూపాలంటూ పిటిషనర్లను ఆదేశించింది న్యాయస్తానం.
ఈనెల 18న మావోయిస్టుల అరెస్ట్ అనంతరం.. కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారనే పోలీసుల ప్రెస్ స్టేట్మెంట్ ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో.. హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా సహా పలువురు కీలక నేతలు మరణించగా.. అదేరోజు విజయవాడలో పలువురు మావోయిస్టు అగ్రనేతలతోసహా 31 మందిని ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు






