టీడీపీ కార్యకర్త హత్య: నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు

by Vemula.Srinu Prasad |

వ్యక్తి హత్య కేసు నిందితులకు పోలీసులు వినూత్న చర్యలు తీసుకున్నారు..

టీడీపీ కార్యకర్త హత్య: నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వ్యక్తి హత్య కేసు నిందితులకు పోలీసులు వినూత్న చర్యలు తీసుకెళ్లారు. జైలుకు హాజరుపర్చే క్రమంలో నిందితులందరినీ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టడంతో ధర్మాసనం వారందరికీ రిమాండ్ విధించింది. అయితే వ్యక్తిని చంపిన నిందితులను పోలీసులు ఇలా చేయడంతో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఏ కేసులోనూ ఇప్పటి వరకూ నిందితులను ఇలా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లలేదన్నారు. ఇప్పటికైనా నిందితుల్లో పరివర్తన రావాలని చెప్పారు. ఈ ఘటనతోనైనా అసాంఘిక కార్యకలాపాలు తగ్గాలని కోరుకున్నారు.

వివరాల్లోకి వెళితే...

కాకినాడ జిల్లా (Kakinada District) కోటనందూరు మండలం అల్లిపూడి(Allipudi)లో ఇటీవల టీడీపీ(Tdp) కార్యకర్త లాలం బంగారయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో 12 మంది నిందితులను గుర్తించారు. అనంతరం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అయితే తుని కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం ప్రస్తుతం చర్చగా మారింది.

రాత్రి సమయంలో దాడి

కాగా లాలం బంగారయ్యతో పాటు మరో ఇద్దరిపై దాదాపు 50 మంది వైసీపీ కార్యకర్తలు మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో లాలం బంగారయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో చింతకాల చినబాబుతో పాటు మిగిలిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story