- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ వర్సెస్ అంబటి.. బయటికి వచ్చిన వెంటనే మళ్లీ మొదలైన రచ్చ
నేడు రాజమండ్రి నుండి కార్యకర్తలతో అంబటి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు అంబటితో మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో అంబటి బయటకు వచ్చారు. ఇక వచ్చిరాగానే నేడు రాజమండ్రి నుండి కార్యకర్తలతో అంబటి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు అంబటితో మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. అంబటి రాంబాబు తన వాహనం దిగి వెనక్కి వచ్చారు.
దీంతో పోలీసులు వాహనాలను వెంటనే క్లియర్ చేశారు. పోలీసుల తీరును అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఎటువంటి దాష్టీకం చేయడం సరికాదని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా ఇంకేం ఇబ్బంది పెట్టగలరని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. వాహనాలలను నిలిపివేస్తే పాదయాత్రగా వెళ్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.






