Double Murder: సికింద్రాబాద్‌లో నిందితుడు కిషోర్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

విజయవాడ డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు....

Double Murder: సికింద్రాబాద్‌లో నిందితుడు కిషోర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ డబుల్ మర్డర్ కేసు(Vijayawada double murder case)ను పోలీసులు ఛేదించారు. విజయవాడలో బుధవారం వెంకట్రావు, రాజు అనే వ్యక్తులను రౌడీషీటర్ కిషోర్(Rowdysheeter Kishore) హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. అయితే ఈ రోజు కిషోర్ సికింద్రాబాద్‌(Secunderabad)లో తిరుగుతుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ(Vijayawada) పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కిషోర్‌ను విజయవాడ తీసుకెళ్తున్నారు. కోర్టులో కిషోర్‌ను శుక్రవారం ప్రవేశ పెట్టనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story