- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచలయ్య హత్య కేసులో సంచలనం.. నెల్లూరు లేడీ డాన్ అరెస్ట్
సీపీఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు..

దిశ, వెబ్ డెస్క్: సీపీఐ కార్యకర్త పెంచలయ్య(CPI activist Penchalaiah) హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు లేడీ డాన్ కామాక్షి(Nellore Lady Don Kamakshi)ని అరెస్ట్ చేశారు. ఇక కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. గంజాయి రవాణా, చోరీలు, ఇతర నేరాలకు సంబంధించిన ముఠాకు లీడర్‌గా కామాక్షి ఉన్నారు. గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని పెంచలయ్యను కామాక్షి గ్యాంగ్ హత్య చేసినట్లు తేలింది.
రెండు రోజుల క్రితం పెంచలయ్యను తొమ్మిది మంది కత్తులతో పొడిచి చంపారు. పోలీసులకి ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నారనే అనుమానంతో పెంచలయ్యను ముఠా సభ్యులతో కలిసి కామాక్షి హత్య చేయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నెల్లూరు బోడిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేసి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.






