టవల్‌తో మెడ బిగించి తల్లిని చంపిన కూతుళ్లు.. కారణం తెలిస్తే షాకే..?

by Vemula.Srinu Prasad |

విశాఖలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు...

టవల్‌తో మెడ బిగించి తల్లిని చంపిన కూతుళ్లు.. కారణం తెలిస్తే షాకే..?
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) బాటజంగాలపాలెం(BataJangalapalem)లో మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చనిపోయిన మహిళ విశాఖ కూర్మన్నపాలెం(Visakhapatnam Kurmannapalem) రాజీవ్ నగర్‌కు చెందిన బంకిళ సంతుగా గుర్తించారు. ఈ హత్యను సొంత కుమార్తెలు, మరిదే చేసినట్లు తేల్చారు. ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో బాబాయ్ సహాయంతో కూతుర్లు హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి సంతు ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు టవల్‌తో మెడ బిగించి హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.

Next Story