- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’: APSRTC ఛైర్మన్ డిమాండ్
టీటీడీ(TTD) గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana karunakar Reddy) అసత్య ప్రచారం చేస్తున్నారని APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు(Konakalla Narayana Rao) మండిపడ్డారు.

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ(TTD) గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana karunakar Reddy) అసత్య ప్రచారం చేస్తున్నారని APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు(Konakalla Narayana Rao) మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీ పై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పై ''అదొక నల్ల రాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుంది'' అంటూ భూమన అనేక విమర్శలు చేశాడని కొనకళ్ల నారాయణరావు అన్నారు.
గోశాలలో 100 ఆవులు చనిపోయినట్టు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున పది ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయి. ఇవి గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టం అవుతుంది. గోశాలలో 250 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ.. గోవుల సంరక్షణ సంక్రమంగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో అసత్య ఆరోపణలు చేస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు.






