Ap: 400 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లాలో పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది...

Ap: 400 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గంజాయి(Marijuana) నిర్మూలనకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కొందరు దుండగులు మాత్రం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వందల కొద్ది గంజాయిని రాష్ట్రాలకు రాష్ట్రాలే తరలించేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక గంజాయి కలకలం రేగుతోంది.

తాజాగా గంజాయిపై ఏలూరు జిల్లా(Eluru District)లో ఈగల్‌ టీమ్(Eagle Team), జిల్లా పోలీసుల(Police) జాయింట్ ఆపరేషన్‌ చేసింది. జంగారెడ్డి గూడెంలో దుండగులు రెండు వాహనాల్లో 400 కేజీల గంజాయి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రైడ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన మినీ వ్యాను, కారు, నాలుగు ఫోన్లను సీజ్ చేశారు. ఒడిషా(Odisha) నుంచి వరంగల్(Warangal) మీదుగా ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)కు తీసుకెళ్తుండగా ఈగల్‌ టీమ్, జిల్లా పోలీసుల గుట్టు రట్టు చేశారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించిన కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Next Story