మావోయిస్టుల కలకలం.. ఏం చెప్పి ఇల్లు రెంట్‌కు తీసుకున్నారో తెలుసా?

by Gantepaka Srikanth |

ఏం చెప్పి మావోయిస్టులు విజయవాడలో ఇల్లు రెంట్‌కు తీసుకున్నారో తెలుసా?

మావోయిస్టుల కలకలం.. ఏం చెప్పి ఇల్లు రెంట్‌కు తీసుకున్నారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మావోయిస్టుల(Maoists) కలకలం రేగిన విషయం తెలిసిందే. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మావోయిస్టులు తలదాచుకున్న ఆ భవన యజమాని కోసం పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇంటి యాజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం. 10 రోజుల క్రితం మావోయిస్టులు వచ్చినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని భవనంలో అద్దెకు ఉంటామన్న మావోయిస్టులు.. వాచ్‌మెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి భవనంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రస్తుతం వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Next Story