- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారంపూడి దోపిడీ కేసు ఛేదన: ఆరుగురు నిందితుల అరెస్ట్
పల్నాడు జిల్లా కారంపూడిలో కలకలం రేపిన భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఒంటరిగా బంగారు ఆభరణాలు తీసుకెళ్లే ప్రయాణికులే లక్ష్యంగా దాడులు చేస్తున్న ప్రమాదకర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) కారంపూడి(Karampudi)లో కలకలం రేపిన భారీ దోపిడీ కేసు(Robbery case)ను పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఒంటరిగా బంగారు ఆభరణాలు తీసుకెళ్లే ప్రయాణికులే లక్ష్యంగా దాడులు చేస్తున్న ప్రమాదకర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో గాలించి ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల రిమాండ్
వరుస రాబరీలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఈ ముఠా సభ్యులు రహదారులపై రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్‌లో భారీగానే ఉంటుందని అంచనా. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






