మాజీ మంత్రి అనిల్‌కు బిగిస్తున్న ఉచ్చు.. వెలుగులోకి సంచలన నిజాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-22 16:42:27  IST  )

క్వార్జ్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కూపీ లాగారు....

మాజీ మంత్రి అనిల్‌కు బిగిస్తున్న ఉచ్చు.. వెలుగులోకి సంచలన నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: క్వార్జ్ అక్రమ రవాణా కేసు(Quartz smuggling case)లో పోలీసులు కూపీ లాగారు. దీంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా(Nellore)లో క్వార్జ్ అక్రమ రవాణా జరిగినట్లు అందించిన ఫిర్యాదులతో విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani goverdhan reddy)ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లో శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తరలించారు. అనంతరం విచారణ చేపట్టారు. దీంతో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌కు సైతం ఉచ్చు బిగిసింది. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై శ్రీకాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

‘‘అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశాం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు.. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. శశిధర్‌రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపాం.’’ అని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు.

Next Story