వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల పిటిషన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-05 09:24:55  IST  )

వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.

వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల పిటిషన్
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత(YCP Leader) వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi) మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ(Vijayawada) ఎస్సీ(SC), ఎస్టీ(ST) ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10 రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు(Police) విజ్ఞప్తి చేశారు.

వంశీ పై గతంలో పదహారు కేసులు నమోదయ్యాయని వివరించారు. వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్‌ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కారును అతను చాలా తెలివిగా మాయం చేశారని చెప్పారు.

ఈ క్రమంలో వాటిని స్వాధీనం చేసుకోవాలని కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ ఇవ్వరాదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో 3 రోజుల పాటు పోలీసు కస్టడీలో వంశీ విచారణకు సహకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో వంశీ బెయిల్‌ పిటిషన్‌, విచారణను రేపటికి వాయిదా వేశారు.

Next Story