- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు వార్నింగ్.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎఫ్ఐఆర్
మాజీ మంత్రి పేర్నినానిపై మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పేర్నినానిపై మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్ పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని, అసభ్యంగా మాట్లాడారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పేర్ని నాని సహా 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న మచిలీపట్నం వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను ఓ కేసు విషయమై సీఐ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి అతడిని స్టేషన్లోనే ఉంచడంతో పేర్ని నాని, అనుచరులు, మేయర్ కలిసి స్టేషన్ కు వెళ్లారు. సుబ్బన్నపై పెట్టిన కేసు రిపోర్టు ఇవ్వాలని అడగడంతో సీఐ, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.
మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసును చింతలపూడి పోలీస్ స్టేషన్కు ఎలా పంపుతారని పేర్నినాని ప్రశ్నించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని, అధికారంలోకి వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో.. పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడని సీఐ బదులిచ్చారు. ఈ వ్యవహారమంతా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టికి చేరడంతో.. ఆయన సీరియస్ అయ్యారు. పేర్ని నాని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పేర్ని నాని తీరును ఎస్పీ తప్పుపట్టడంతో.. ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని తెలిపారు. తామెవ్వరినీ దుర్భాషలాడలేదన్నారు. మేయర్ ను సీఐ రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే గట్టిగా మాట్లాడామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ వ్యవహారం.. నువ్వా నేనా అన్నట్లుగా ఉందని, పేర్నినానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.






