- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kodali Nani: కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అనుచరులకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకి నోటీసులు అంజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అనుచరులకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకి నోటీసులు అంజేశారు. వలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కలర్గోదాం కేసుల్లో ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఘటనలపై కొడాలి నాని, బేవరేజెస్మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే కేసులో అప్పటి జేసీ మాధవీలతారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది. తనకు చెందిన ఏపీ బేవరేజెస్గోడౌనును రెండేళ్ల కాలపరిమితి ఉన్నా దానిని తరలించేందుకు ప్రయత్నించారని గుడివాడకు (Gudivada) చెందిన దుగ్గిరాల ప్రభాకర్అనే వ్యక్తి గత ఏడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇదే ఆరోపణలపై నానికి అనుచరులకు నోటీసులివ్వడం కలకలం రేపింది. వీరిని విచారించిన అనంతరం నానిపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.






