Manchu Manoj : మంచు మనోజ్ కు పోలీసుల నోటీసులు

by M.Rajitha |
Manchu Manoj : మంచు మనోజ్ కు పోలీసుల నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు ఫ్యామిలీలో వివాదాలు(Manchu Family Issues) కొనసాగుతున్నాయి. తాజాగా మంచు మనోజ్(Manchu Manoj) తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)కి వెళ్తానని ప్రకటించడంపై మోహన్ బాబు(MohanBabu) పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున తిరుపతి రావొద్దు అంటూ నోటీసులు జారీ చేశారు. అయితే మనోజ్ ను తన యూనివర్సిటీకి రాకూడదని కోర్ట్ ఉత్తర్వులు ఉన్నాయని, వాటి ప్రకారం వర్సిటీకి రానివ్వకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఎంబీయూ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా మనోజ్ తిరుపతి షెడ్యూల్ ప్రకారం.. మొదట తన బంధువుల ఇంటికి వెళ్ళి, అనంతరం ఫాన్స్ తో ర్యాలీగా యూనివర్సిటీకి, అక్కడినుంచి నారావారిపల్లెలో జల్లికట్టు ఉత్సవానికి హాజరవాల్సి ఉంది. అయితే పోలీసుల నోటీసుల నేపథ్యంలో మనోజ్ దంపతులు వర్సిటీకి వెళ్ళకుండా నారావారిపల్లెకు వెళ్ళి లోకేష్ ను కలిసి, జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించారు.

Advertisement

Next Story