తండ్రీకొడుకుల హత్య కేసులో పురోగతి.. నిందితుడు అనిల్ రెడ్డి అరెస్ట్..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-23 12:14:18  IST  )

తండ్రీకొడుకుల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు..

తండ్రీకొడుకుల హత్య కేసులో పురోగతి.. నిందితుడు అనిల్ రెడ్డి అరెస్ట్..?
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు డబుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా రియల్టర్ల మధ్య గొడవల నేపథ్యంలో పాతమాగులూరు రియల్ ఎస్టేట్ వెంచర్లలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. కోర్టు పని నిమిత్తం బెంగళూరు నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట వెళ్లిన వీరాస్వామిరెడ్డి, అతని కొడుకు కె.వి ప్రసాద్ రెడ్డిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం పాతమాగులూరు తీసుకెళ్లి హత్య చేశారు. మృతదేహాలను స్థానిక వెంచర్‌లో పడేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘వీరాస్వామిరెడ్డి, అతని కొడుకు కె.వి ప్రసాద్ రెడ్డి న్యాయవాది నాగభూషణంతో కలిసి మంగళవారం సాయంత్రం విమానంలో బెంగళూరు నుంచి వచ్చారు. అనంతరం ఓ లాడ్జిలో బస చేశారు. ఈ రోజు ఉదయం కోర్టు సమీపంలో శ్రీనిధి గ్రాండ్ హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా 6 గురు వచ్చి లాక్కొని వెళ్ళారు. ఆ తర్వాత సంతమాగులూరు వెంచర్ లో కిరాతకంగా నరికి హత మార్చారు. ఈ ఘటన ఉదయం 10.10- 30 మధ్య జరిగింది.’’ అని విచారణలో తేలినట్లు సమాచారం

అయితే తండ్రి కొడుకుల కిడ్నాప్ సమయంలో కోర్టు ఆవరణలో గడ్డం అనిల్ రెడ్డి ఉన్నారు. అది గ్రహించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్‌పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగి కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. న్యాయవాది నాగభూషణంతో మాటాడి వీరి వైషమ్యాలను తెలుసుకున్నారు. పోలీసులు సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు.

Next Story