కాశీబుగ్గ ఘటనపై దుష్ప్రచారం.. విశాఖ రేంజ్ డీఐజీ తీవ్ర హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం మండలం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు..

కాశీబుగ్గ ఘటనపై దుష్ప్రచారం.. విశాఖ రేంజ్ డీఐజీ తీవ్ర హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం మండలం కాశీబుగ్గ(Kasibugga) వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి(Visakhapatnam Range DIG Gopinath Jetty) కీలక విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తుపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అవాస్తవాలు, అసత్య, దుష్ప్రచారాలు చేస్తున్నారని అలా చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇటువంటి పోస్టులు, వీడియోలు,వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. పోస్టులు పెట్టిన వివరాలు, లొకేషన్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పోలీసు శాఖ అధికారిక సమాచారం మాత్రమే నమ్మి, శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.

Next Story