సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో మరో ట్విస్ట్.. ఆ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-01 08:54:41  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో మరో ట్విస్ట్.. ఆ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ దశలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ భవనంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. ఈ తరుణంలో నిర్మాణ దశలో ఉన్న భవనంలోని 5,6 అంతస్తుల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. ఈ క్రమంలో మొదటి అంతస్తులో హోమం జరిగినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. ఈ తరుణంలో అక్కడ జరిగింది హోమం పూజలా? లేదా క్షుద్రపూజలా ? అనే విషయం పై స్పష్టత లేదు. కానీ.. ఆ పూజలు ఎవరు చేశారనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు లో ఇవాళ(శుక్రవారం) డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు.

Next Story