- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను చంపి ఏమీ తెలియనట్టు యాక్టింగ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
విశాఖ జిల్లా బక్కన్నపాలెం లో భర్త అదృశ్యం కేసులో పోలీసులు షాకింగ్ నిజాలను వెలికితీశారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా బక్కన్నపాలెం(Bakkannapalem)లో భర్త అదృశ్యం కేసులో పోలీసులు షాకింగ్ నిజాలను వెలికితీశారు. తన భర్త నాగరాజు కనిపించడంలేదని డిసెంబర్ 9న భార్య రమ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే నాగరాజు అదృశ్యంపై గాలిస్తున్న పోలీసులకు తిమ్మాపురం(Timmapur)లో రోడ్డు వద్ద కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం ఉందని స్థానికుల నుంచి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం నాగరాజుదిగా గుర్తించారు. అనంతరం నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నాగరాజును భార్య రమ్యే చంపినట్లు గుర్తించారు. నాగరాజు హత్యలో ప్రియుడితో పాటు మరో ముగ్గురు సైతం పాల్గొన్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






