పొదిలిలో మహిళలపై రాళ్లు, చెప్పు: ఆరుగురు వైసీపీ కార్యకర్తలకు కస్టడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-24 14:09:09  IST  )

పొదిలిలో మహిళలపై రాళ్లు, చెప్పులు రువ్విన కేసులో ఆరుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు కస్టడీ తీసుకున్నారు...

పొదిలిలో మహిళలపై రాళ్లు, చెప్పు: ఆరుగురు వైసీపీ కార్యకర్తలకు కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పొదిలి(Podili)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YSR Congress Party chief and former CM YS Jagan Mohan Reddy) పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్(Jagan) పర్యటనకు ముందు అమరావతి రైతుల(Amaravati Farmers)ను వైసీపీ నేతలు అవమానించినందుకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలోనూ పొదిలిలో స్థానిక మహిళ నిరసన వ్యక్తం చేశారు. అయితే తమ అధినేత పర్యటనను అడ్డుకునేందుకే మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులకు గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. క్షుణ్ణంగా కేసులో దర్యాప్తు చేశారు. దీంతో ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు నిర్దారణకు వచ్చారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిందితులను పోలీసులు తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. తొలి రోజు విచారణ ముగిసిన అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.

Next Story