- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్వేల్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రామలింగారెడ్డిది కీలక పాత్రగా గుర్తింపు
కడప జిల్లా బద్వేల్ హనీ ట్రాప్ కేసులో పోలీసులు విషయాలు వెల్లడించారు. ఈ కేసులో గూడెంగ్రామానికి చెందిన రామలింగారెడ్డి అనే వ్యక్తిది కీలక పాత్రగా గుర్తించారు...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) బద్వేల్ హనీ ట్రాప్ కేసు(Badvel Honey Trap Case)లో పోలీసులు విషయాలు వెల్లడించారు. ఈ కేసులో గూడెంగ్రామానికి చెందిన రామలింగారెడ్డి అనే వ్యక్తిది కీలక పాత్రగా గుర్తించారు. హనీ ట్రాప్‌లో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software Employee) అశోక్ రూ. 80 లక్షలకుపైగా నష్టపోయారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్‌తో అశోక్‌ను నిండా ముంచేసినట్లు తేలింది.
ఇన్ స్టాగ్రామ్‌లో మేసేజ్
2023లో అశోక్‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో పూజిత రెడ్డి(అలియాస్ మానస) పేరుతో అశోక్‌కు ఓ మెసేజ్ వెళ్లింది. అయితే పూజిత తనకు తెలుసు అని, ఆమె అకౌంట్‌ను యాక్సెప్ట్ చేయాలని అశోక్‌కు గూడెం గ్రామానికికే చెందిన రామలింగారెడ్డి మాయ మాటలు చెప్పారు. ఆ మాటలు నమ్మిన అశోక్.. పూజిత మెసెజ్ కు రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అశోక్‌ను ప్రేమిస్తున్నట్లు పూజిత ట్రాప్ చేశారు. తన అక్క పెళ్లికి కట్నం డబ్బులు ఇవ్వాలని, కొత్త ఇంటి నిర్మాణానికి లోన్ ఆలస్యం అవుతోందని ఈ లోపు డబ్బులు సర్దుబాటు చేయాలని అశోక్ నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. పూజిత ను మెసేజ్ వచ్చినప్పుడల్లా అశోక్ అప్పు చేసి మరీ ఆమె పేరుతో ఉన్న అకౌంట్‌కు డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న అశోక్.. కొంత మొత్తాన్ని ఇవ్వాలని పూజత అడిగారు. దీంతో పూజిత ప్లేట్ ఫిరాయించారు. తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని నాటకమాడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పూజిత బెదిరించింది. డబ్బులు అడిగినప్పుడల్లా పూజిత పొంతనలేని సమాధానం చెప్పడంతో అశోక్‌కు అనుమానం కలిగింది.
బద్వేల్ అర్బన్ పోలీసులకు ఫిర్యాదు
తాను మోసపోయినట్లు గ్రహించి బద్వేల్ అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. పూజితతో పాటు ఆమె ఫ్రెండ్ చంద్రకళ అకౌంట్ నుంచి రామలింగారెడ్డి ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.






