Breaking News : వైసీపీ కీలక నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు

by Muthe.Rajitha |

పొట్టి శ్రీరాములు నెల్లూరు(Potti Sriramulu Nellur) జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ(YSRCP) ముఖ్యనేతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Breaking News : వైసీపీ కీలక నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు(Sri Potti Sriramulu Nellur) జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ(YSRCP) ముఖ్యనేతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అధికారులు సీజ్ చేసిన మైన్ లో అనుమతులు లేకుండా మైనింగ్ చేశారనే ఆరోపణలతో వైవీ రామిరెడ్డి(YV Ramireddy)పై నేడు రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడంతో రెవెన్యూ అధికారులు రామిరెడ్డికి చెందిన ఎస్ఎల్వీ క్వారీపై రూ.100 కోట్ల ఫైన్ విధించారు. ఫైన్ కట్టకపోవడంతో అధికారులు మైన్ ను సీజ్ చేశారు. కాగా గత కొద్దిరోజులుగా రామిరెడ్డి సీజ్ చేసిన మైన్లో ఎలాంటి అనుమతులు లేకుండానే కంకర తరలింపుతోపాటు మైనింగ్ పనులు చేపట్టాడని రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. నేడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Next Story