- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: గంజాయి బ్యాచ్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
విశాఖ గంజాయి బ్యాచ్ కేసులో పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) గంజాయి(Ganja) బ్యాచ్ కేసులో పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కారును అద్దెకు తీసుకుని దుండగులు విశాఖ సర్వీస్ రోడ్డు(Visakha Service Road)లో గంజాయి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న తల్లి, అమ్మమ్మతో కలిసి వెళ్తున్న చిన్నారిని ఢీకొట్టారు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందారు. అయితే కారులో గంజాయి తరలిస్తున్న విషయం ఈ ప్రమాదంతో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో యువతితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






