థార్‌తో గుద్ది.. బ్యాట్‌తో దాడి.. సీసీటీవీలో అసలు నిజాలు బయటకి..!

by Vemula.Srinu Prasad |

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన 'థార్ వార్' కేసులో పోలీసులకు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. మాట్లాడదాం రమ్మని పిలిచి, బొల్లా ఓంకార్ అనే వ్యక్తిపై లింగమనేని రోహిత్ అత్యంత దారుణంగా దాడికి తెగబడినట్లు ఈ దృశ్యాల్లో స్పష్టమైంది....

థార్‌తో గుద్ది.. బ్యాట్‌తో దాడి.. సీసీటీవీలో అసలు నిజాలు బయటకి..!
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో తీవ్ర కలకలం రేపిన 'థార్ వార్'(Thar War) కేసులో పోలీసులకు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. మాట్లాడదాం రమ్మని పిలిచి, బొల్లా ఓంకార్(Bolla Omkar) అనే వ్యక్తిపై లింగమనేని రోహిత్(Lingamaneni Rohit) అత్యంత దారుణంగా దాడికి తెగబడినట్లు ఈ దృశ్యాల్లో స్పష్టమైంది. 100 అడుగుల సర్వీస్ రోడ్డులో ఓంకార్ వెళ్తుండగా, రోహిత్ తన థార్ వాహనంతో మొదట అతడిని బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత ఏమాత్రం తగ్గకుండా కారులో నుంచి బ్యాట్ తీసి ఓంకార్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

నడిరోడ్డుపై బాహాబాహీ.. రంగంలోకి స్థానికులు

రోహిత్ ఒక్కసారిగా బ్యాట్‌తో విరుచుకుపడటంతో ప్రాణరక్షణ కోసం బొల్లా ఓంకార్ కూడా ఎదురుదాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య నడిరోడ్డుపైనే కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు పంతాలకు పోయి రోడ్డుపైనే బాహాబాహీకి దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు గమనించిన స్థానికులు చొరవ తీసుకుని, ఇరువర్గాలను సమాధానపరిచి వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును మరింత వేగవంతం చేశారు.

థార్ వార్ వీడియో

Next Story