- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ బీచ్ రోడ్ పరిధిలో ‘నో ఫ్లయింగ్ జోన్’ అమలు
విశాఖలో ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్ కాన్‌క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు...

దిశ, విశాఖపట్నం: విశాఖలో ఈ నెల 19 వరకు నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్ కాన్‌క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరంలో డ్రోన్ల ఎగురవేతపై ఈ నెల 20వ తేదీ వరకు నిషేధం విధించినట్లు ప్రకటించారు. బుధవారం నుంచి 20వ తేదీ వరకు నగరంలోని బీచ్ రోడ్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో కూడా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదని పోలీసులు హెచ్చరించారు.
టెంపరరీ రెడ్ జోన్ ప్రకటింపు
ఐఎన్ఎస్ డేగా నుంచి బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ రోడ్డు వరకు సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రోన్ కెమెరాలు వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్చీ హెచ్చరించారు






