Breaking: విచారణకు రా..: కాకాణికి పోలీసుల బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-12 11:22:40  IST  )

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు..

Breaking:  విచారణకు రా..: కాకాణికి పోలీసుల బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేశ్(Former ministers Ambati and Jogi Ramesh) అరెస్ట్‌లు, రిమాండ్లు సంచలనం రేగిన నేపథ్యంలో మరో నేతకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy). నెల్లూరు జిల్లాలో జరిగిన మైనింగ్ తవ్వకాల్లో ఆయన ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రభుత్వంపై మరింత విరుచుకుపడుతున్నారు. ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

తాజాగా

అయితే కాకాణికి తాజాగా నెల్లూరు జిల్లా(Nellore) కోవూరు పోలీసులు(Kovuru Police) నోటీసులు జారీ చేశారు. గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని, ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. మరి కాకాణి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story