- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు...

దిశ, వెబ్ డెస్క్: ములకలచెరువు నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో ఎక్సైజ్ పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసు ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావును శుక్రవారం విజయవాడ ఎయిర్ పోర్టు(Vijayawada Airport)లో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్‌ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో అష్రఫ్ 21వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు నిందితులు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు జయచంద్రారెడ్డి, మరో నిందితుడు గిరిధర్ రెడ్డి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద గస్తీకాస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన అష్రఫ్ కారులోనే బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేశారని పోలీసులు గుర్తించారు.






