- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Guntur: అభంశుభం తెలియని మార్క్ శంకర్‌పై అనుచిత పోస్టులు.. తిక్క కుదిర్చిన పోలీసులు

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే మరికొందరు నీచ పనులకు దిగుతున్నారు. తమకు నచ్చకపోతే చాలు అతను ఎలాంటి వాడైనా సరే అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. మంచి, చెడు అలోచనే లేదు. ఇష్టమొచ్చిన బూతులు తిడుతున్నారు. అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి అయితే ఇక అతని పని అయిపోయినట్టే. తిట్లదండకం చదువుతున్నారు. వాళ్ల పిల్లను కూడా వదిలిపెట్టడంలేదు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్(AP Deputy CM Pawan Kalyans son Mark Shankar) ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చిన్న పిల్లవాడు. సింగపూర్(Singapore)లో చదువుకుంటున్నాడు. తండ్రి రాజకీయాల గురించి మార్క్ శంకర్‌కు తెలిసే అవకాశం లేదు. ఆ స్థాయి నాలెడ్జ్ రావడానికి మరో పది, పదేళ్లు పట్టొచ్చు. అలాంటి చిన్న పిల్లవాడిని కొందరు నీచులు టార్గెట్ చేశారు. ప్రమాదంపై సానుభూతి లేకుండా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అభం శుభం తెలియని మార్క్ శంకర్‌పై ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు పెట్టారు.
ఈ ఘటన గుంటూరు జిల్లా పత్తిపాడులో జరిగింది. మార్క్ శంకర్‌పై అసభ్యంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టడం జిల్లాలో వైరల్‌గా మారాయి. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల వెనుక అసలు సూత్రధారి ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.