పోలీసుల భారీ ఆపరేషన్: ఐదుగురు అరెస్ట్, కోటిన్నర ఆభరణాలు స్వాధీనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-07 13:09:17  IST  )

కోనసీమ జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి, 2025లో కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు. ఈ కేసులో పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవి అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి...

పోలీసుల భారీ ఆపరేషన్: ఐదుగురు అరెస్ట్, కోటిన్నర ఆభరణాలు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి, 2025లో కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు. ఈ కేసులో పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవి అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రవిశంకర్‌పై గతంలోనే 120కి పైగా చోరీ కేసులు ఉండగా, మరో నిందితుడు చిరంజీవిపై హత్య కేసు నమోదై ఉండటం గమనార్హం. వీరి అరెస్టుతో జిల్లాలో వరుస దొంగతనాలకు బ్రేక్ పడినట్లయింది.

చైన్ స్నాచింగ్ ముఠా ఆట అరెస్ట్

మరోవైపు కాకినాడ జిల్లాలో కూడా పోలీసులు చైన్ స్నాచింగ్ ముఠా ఆట కట్టించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 50 లక్షల విలువైన ఆభరణాలను రికవరీ చేశారు. ఈ ముఠా గత కొంతకాలంగా రద్దీ ప్రాంతాల్లో మరియు ఒంటరిగా వెళ్లే మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

అప్రమత్తంగా ఉండాలి..

జిల్లాల్లో పెరిగిన నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ భారీ రికవరీల నేపథ్యంలో నిందితులను పట్టుకున్న పోలీస్ బృందాలను ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు కూడా అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విలువైన ఆభరణాలతో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story