పోలీసుల మెరుపు దాడి.. 14 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరుగుతున్న పేకాట గుట్టును పోలీసులు ఛేదించారు. రావిపాడు పంచాయితీ పరిధిలోని సాయి డిఫెన్స్ అకాడమీ ఎదురుగా ఉన్న ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు...

పోలీసుల మెరుపు దాడి.. 14 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
X

దిశ, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న పేకాట గుట్టును పోలీసులు ఛేదించారు. రావిపాడు పంచాయితీ పరిధిలోని సాయి డిఫెన్స్ అకాడమీ ఎదురుగా ఉన్న ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.37,000 నగదు, 7 మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పేకాట జరుగుతున్నట్టు సమాచారం అందడంతో నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ కిషోర్, ఎస్‌ఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకుని నగదు, వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ కిషోర్, స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story