భయపెట్టి రూ.59 లక్షలు వసూలు.. ఇద్దరు కాకినాడ వాసుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు..

భయపెట్టి రూ.59 లక్షలు వసూలు.. ఇద్దరు కాకినాడ వాసుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో బెదిరింపులకు పాల్పడి నుంచి రూ. 59 లక్షలు వసూలు చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ(Kakinada)కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, నవీన్ వాట్సప్ కాల్ చేశారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో తమరు అవినీతికి పాల్పడ్డారని, మీ ఖాతాల్లో చాలా డబ్బులు ఉన్నాయని, ఉన్న పళంగా అరెస్ట్ చేయబోతున్నామని భయపెట్టారు. తమను అరెస్ట్ చేయకుండా ఉంటాలంటే రూ. 59 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన రిటైర్డ్ ఉద్యోగి ఆర్జీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు రాబట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు సెల్ ఫోన్స్, 10 డెబిట్ కార్డులు, చెక్ బుక్స్, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.

అయితే కేసు విచారణలో గుర్తించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగి నుంచి వసూలు చేసిన రూ. 59 లక్షలను నిందితులు సెల్ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు పేర్కొన్నారు. బైనాన్స్ పీ2పీ ద్వారా పర్సనల్ ఖాతాలకు డబ్బులు డిపాజిట్ చేశారని తెలిపారు. ఇప్పటి వరకూ వీళ్లు రూ. 8 కోట్లు కొట్టేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వాట్సప్ కాల్ వస్తూ సమయస్పూర్తితో వ్యవహరించాలని సూచించారు. వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Next Story