Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-24 16:01:41  IST  )

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు..

Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె ఫైల్స్ దగ్ధం(Madanapalle Files Burnt) కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy) ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి(Madhav Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు.. పోలీసుల తీరును ఖండించారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. మాధవరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసిందని, అందుకే అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇందులో భాగంగా మాధవరెడ్డిని పోలీసులతో అరెస్ట్ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో మదనపల్లెతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. భూములకు సంబంధించిన కీలక రికార్డులు కాలిపోయాయి. మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఫైళ్ల దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు ఉన్నారనే ఆరోపణలు చెలరేగాయి. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పలు కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా చర్యలకు దిగారు. తాజాగా పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story