రూ. 500కే కోటి విలువైన భూమి అమ్మకానికి ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు

by Vemula.Srinu Prasad |

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు కోటి విలువైన భూమిని ఐదు వందలకు అమ్మేందుకు చేసిన ప్లాన్‌ను పోలీసులు అడ్డుకున్నారు..

రూ. 500కే కోటి విలువైన భూమి అమ్మకానికి ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) పెనుగంచిప్రోలు(Penuganchiprol)కు చెందిన రైతు తనకున్న 92 సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టారు. అయితే ఆయన రూ. కోటి ఆశించారు. కానీ ఆ ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వినూత్నంగా ఆలోచించారు. లక్కీ డ్రాలో రూ. 500లకే కోటి రూపాయల విలువైన భూమిని లాటరీ విధానంలో తీసుకోవచ్చని ప్రచారం చేశారు. ఈ మేరకు 3 వేల మంది వరకూ రూ. 500లు కట్టి రిసిప్ట్ తీసుకున్నారు. మరికొందరు సైతం రూ. 500లకు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే విషయం పోలీసులకు తెలియడంతో రైతు ప్లాన్ బెడిసికొట్టింది. లాటరీ విధానంలో భూ అమ్మకాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు లాటరీని నిలిపివేశారు. రూ.500లు కట్టిన వారికి రైతు తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారు. మరోవైపు రూ. 500లకే భూమి అమ్మకంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story