సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల దృష్టి

by Disha Web Desk 18 |
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల దృష్టి
X

దిశ,చంద్రగిరి:సార్వత్రిక ఎన్నికలు - 2024 నేపథ్యంలో జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలసి జిల్లా పోలీసు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు కవాతు నిర్వహించారు.చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ రామయ్య, ఎస్సైలు అనిత, రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో తొండవాడ గ్రామం నుంచి ప్రారంభించి చంద్రగిరి టవర్ క్లాక్ సర్కిల్ మీదుగా చంద్రగిరి టౌన్ మొత్తం తిరిగి నూర్ జంక్షన్ వరకు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఓటర్లను చైతన్యవంతులు చేసి ధైర్యాన్ని నింపారు. అదేవిధంగా రామచంద్రా పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం గ్రామాలు అయిన కాలేపల్లి, ఎన్ ఆర్ కమ్మపల్లి, నెత్త కుప్పం గ్రామంలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అగరాల ఐతేపల్లి గ్రామాల పరిధిలో సైతం కవాతు చేపట్టారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.

Next Story