- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ బెట్టింగ్స్‌పై ఉక్కుపాదం.. పోలీస్ శాఖ సంచలన వార్నింగ్
ఐపీఎల్ బెట్టింగ్స్‌పై పోలీస్ శాఖ సంచలన వార్నింగ్ ఇచ్చాంది...

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్(Ipl Sessions) నడుస్తోంది. హైదరాబాద్(Hyderabad)తో పాటు విశాఖ(Vishaka)లోనూ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. దీంతో క్రికెట్ బెట్టింగ్స్(Cricket Betting) జోరందుకున్నాయి. ప్రత్యక్షంగా కొన్ని చోట్ల జరుగుతుంటే ఆన్‌లైన్ ద్వారా కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో డబ్బులు పోగొట్టుకుని బాధితులు రోడ్డు పాలవుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ కట్టిన కొందరు నష్టాలు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కలకలం రేపాయి. దీంతో బెట్టింగ్స్ నిర్వహణపై రెండు రాష్ట్రాల పోలీసు శాఖలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాయి.
అయితే ఐపీఎల్ బెట్టింగులను కట్టడి చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ(AP Police Department) ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారింది. ఈ మేరకు నిఘాను పెంచింది. బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులకు దిగుతున్నారు. నిందితులతో పాటు నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిందతులను జైలుకు పంపుతుననారు. మరోవైపు బెట్టింగ్ నిర్వాహకులపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. రంగంలోకి డైరెక్ట్‌గా ఏపీ డీజీపీ మహేశ్ కుమార్ గుప్తా(DGP Mahesh Kumar Gupta) దిగారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగుల్లో పాల్గొని యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నిర్వాహకుల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని డీజీపీ గుప్తా హెచ్చరించారు.






