పెనుకొండ హవాలా దోపిడీ కేసు: ఏడుగురు అరెస్ట్, భారీగా డబ్బు స్వాధీనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-06 08:56:11  IST  )

అనంతపురం జిల్లా పెనుకొండ పరిధిలో సంచలనం సృష్టించిన హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు...

పెనుకొండ హవాలా దోపిడీ కేసు: ఏడుగురు అరెస్ట్, భారీగా డబ్బు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) పెనుకొండ(Penugonda) పరిధిలో సంచలనం సృష్టించిన హవాలా నగదు(Hawala Cash) దోపిడీ కేసు(Robbery case)ను పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. హవాలా డబ్బును తరలిస్తున్న కారును వెంబడించి మార్గమధ్యంలో అడ్డగించి భారీ మొత్తంలో నగదును దోచుకున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 కోట్ల భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లను సీజ్ చేశారు. పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది.

రిమాండ్‌కు నిందితులు

అయితే నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పుట్టపర్తి ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో కేసును ఛేదించి భారీ మొత్తంలో నగదును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని ఆయనతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. హవాలా మార్గాల్లో నగదు తరలించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.

Next Story