పలాస గోల్డ్ షాప్ చోరీ కేసు ఛేదన.. ఒడిశా గ్యాంగ్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

పలాసలో సంచలనం సృష్టించిన గోల్డ్ షాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెలలో తుపాకులతో బెదిరించి భారీగా బంగారాన్ని దోచుకెళ్లారు..

పలాస గోల్డ్ షాప్ చోరీ కేసు ఛేదన.. ఒడిశా గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పలాస(Palasa)లో సంచలనం సృష్టించిన గోల్డ్ షాప్ చోరీ కేసు(Gold Shop Robbery Case)ను పోలీసులు ఛేదించారు. గత నెలలో తుపాకుల(Guns)తో బెదిరించి భారీగా బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనపై ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు చివరకు ఒడిశా(Odisha gang)కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి ఇప్పటివరకు 247 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరికొందరి హస్తం...!

విచారణలో భాగంగా ఈ ముఠా మొత్తం 800 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్న ఈ గ్యాంగ్ వివరాలను సేకరించిన పోలీసులు, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన వారిని విచారించగా, ఈ దోపిడీలో మరికొందరి హస్తం ఉన్నట్లు వెల్లడైంది.

యూపీ గ్యాంగ్' కోసం గాలింపు

ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న 'యూపీ గ్యాంగ్' కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీరు ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకొని, పూర్తిస్థాయిలో రికవరీ చేస్తామని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Next Story