ఇంద్రకీలాద్రిలో బంగారు నగలు చోరీ.. అంతర్‌ జిల్లా నేరస్థుడు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-31 13:05:49  IST  )

ఇంద్రకీలాద్రిలో బంగారు నగలు చోరీ చేసిన కేసులో పోలీసులు ఛేదించారు...

ఇంద్రకీలాద్రిలో బంగారు నగలు చోరీ.. అంతర్‌ జిల్లా నేరస్థుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri)లో ఏప్రిల్ నేలలో చోరీ(Theft) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. కారులో ఉంచిన నగలు ఎత్తుకెళ్లింది అంతర్‌ జిల్లా నేరస్థుడు చింతా గణేష్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25 లక్షల విలువైన 180 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకన్నారు. నిందితుడు గణేష్.. 15 ఏళ్ల పాటు ఖతార్‌లో డ్రైవర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఏప్రిల్ 15న అమలాపురానికి చెందిన భక్తులు పెళ్లికి వెళ్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శానికి వెళ్లారు. అయితే ఓంకారం పాయింట్ వద్ద కారును పార్కర్ చేసి పూజా సామగ్రా కొనేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే చూసే సరికి కారులో ఉంచిన 25 కాసుల బంగారం కనిపించలేదు. దీంతో దుర్గగుడి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇన్నాళ్టికి గుర్తించారు.

Next Story